← Back to news

కలెక్టర్ సత్య శారదకు మహిళల అభినందనలు

By kesharaju sai kumar· 1d ago· Warangal
కలెక్టర్ సత్య శారదకు మహిళల అభినందనలు

వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా చిన్నారుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద చొరవతో తల్లిదండ్రుల మొబైల్ నంబర్లతో కూడిన రిస్ట్ బ్యాండ్లను పిల్లలకు అందిస్తున్నారు. ఉర్సుగుట్ట వద్ద ఖిలా వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ వీటిని పంపిణీ చేశారు. పండుగ రద్దీలో పిల్లలు తప్పిపోయినా తల్లిదండ్రులను త్వరగా గుర్తించేందుకు ఈ ఏర్పాటు చేశారు.

More in Local