విద్యార్థులకు AP ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP ప్రభుత్వం గురుకులాల విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి డైట్ ఛార్జీలను 10% పెంచుతూ డిసిషన్ తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఇది అమల్లోకి రానుంది. పెరిగిన ధరల దృష్ట్యా డైట్ ఛార్జీల పెంపుపై ఇటీవల CM చంద్రబాబు అధికారుల నుంచి నివేదిక కోరారు. వారి ప్రతిపాదనల్ని పరిశీలించి సచివాలయంలో సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ విభాగాల్లోని 6.52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.



