అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ ఫిక్స్!

అల్లరి నరేష్ కొత్త సినిమా 'రంభ ఊర్వశి మేనక' టీజర్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 11న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ రిలీజ్ డేట్‌లో చిన్న చేంజ్ మాత్రమే చేశామని, ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని చెప్పారు. ఈ మూవీ అల్లరి నరేష్ ఓల్డ్ కామెడీ టైమింగ్‌ను గుర్తుచేసేలా ఉండబోతుందని పోస్టర్లు చూస్తేనే అర్థమవుతోంది.



