శ్రీవారి దర్శనం తర్వాత తీరని విషాదం

AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతికి వస్తున్న కర్ణాటకకు చెందిన భక్తుల కారు 22వ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని 15అడుగుల లోతులోకి బోల్తా పడింది. ప్రమాదంలో సతీష్ కుమార్(72) తీవ్రంగా గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోఇద్దరు చిన్నారులు సహా కుటుంబసభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్, గోట్టిగెరికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.



