ఎల్నినో ఎఫెక్ట్.. ఎకరానికి ₹10 వేల పరిహారం?

TG: ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో 11 లక్షల 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఎకరానికి ₹10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. వ్యవసాయం, పశువుల మేత, తాగునీటి కోసం మొత్తం ₹2,170.68 కోట్ల సాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని 117 మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది. నీటి కొరతతో 7 లక్షల ఎకరాలకు ఒక్క తడి మాత్రమే అందించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


