పిల్లలకు వీడియో కాల్ చేసి దంపతుల ఆత్మహత్య!

హైదరాబాద్ ఘట్‌కేసర్ పరిధిలో రవికుమార్, శిరీష దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రీసెంట్ గా రెడీమిక్స్ వెహికల్ కొని అప్పులు కావడం, ఇంట్లో గొడవలే దీనికి కారణం అని తెలుస్తోంది. చనిపోయే ముందు కన్న పిల్లలకు వీడియో కాల్ చేసి, "తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. గొడవ పడకండి" అని ఏడుస్తూ చెప్పారు. పిల్లలు కంగారుపడేలోపే రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



