← Back to news

10న మూడు అనువాద పుస్తకాల ఆవిష్కరణ

By Vishi· 2h ago
10న మూడు అనువాద పుస్తకాల ఆవిష్కరణ

TG: సామాజిక సత్యాలను ప్రతిబింబించే మూడు అనువాద పుస్తకాల (అదృశ్యకథనం, నిషేధిత పుస్తకాల లైబ్రరీ, మూక)ను ఛాయ బుక్స్ సంస్థ ఆవిష్కరిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరం లామకాన్‌లో జరుగుతుంది. ప్రముఖ నటుడు, సామాజికవేత్త ప్రకాష్‌రాజ్ ముఖ్యఅతిథిగా సెప్టెంబర్ 10 గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, కవయిత్రి మెర్సీ మార్గరెట్, అనువాదకులు కె.సత్యరంజన్, అరిపిరాల సత్యప్రసాద్, మానస ఎండ్లూరి పాల్గొననున్నారు.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 5d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.