← Back to news

ఇవాళ త్రిపురనేని గోపీచంద్ జయంతి

By Vishnu· 4h ago
ఇవాళ త్రిపురనేని గోపీచంద్ జయంతి

ఇవాళ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది త్రిపురనేని గోపీచంద్(1910-1962) జయంతి. త్రిపురనేని గోపీచంద్‌ రచనల్లో సమాజంలోని సమస్యలు, మనుషుల ఆలోచనలు, జీవితంలోని సంఘర్షణలు కనిపిస్తాయి. ‘అసమర్థుని జీవయాత్ర’, ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ ఆయన ప్రసిద్ధ రచనలు. ఇందులో మనిషి జీవితం, ఆలోచనలు, సమాజం మధ్య ఉన్న సంఘర్షణను చూపించారు. సమాజంలోని తప్పులను ప్రశ్నిస్తూ, ప్రజలు కొత్తగా ఆలోచించేలా ఆయన రచనలు చేశారు. ఆయన రచనలు అప్పటి కాలానికే పరిమితం కాకుండా, నేటికీ పాఠకులను ఆలోచింపజేస్తున్నాయి.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 5d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.