బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి చించోలికి బస్సులో వెళ్తున్న కర్ణాటకలోని జట్టూర్ గ్రామానికి చెందిన పుష్పలతకు దారిలోనే పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును దగ్గర్లోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే పుష్పలత బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తర్వాత తల్లీబిడ్డలను ఆసుపత్రిలో చేర్చగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. సరైన సమయంలో స్పందించి సాయం చేసిన డ్రైవర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.



