ప్రియాంక కేసులో షాకింగ్ విషయాలు

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంకను కారుతో <a href="https://www.theclearcutnews.com/n/NHxpTeJ">ఢీకొట్టిన</a> ఘటనలో జిల్లా SP నరసింహ కిషోర్ కీలక విషయాలను వెల్లడించారు. మద్యంమత్తులో ఉన్న నిందితులను మాల్ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో వారు సిబ్బందిపై దాడిచేసి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ప్రియాంక, ఆమె స్నేహితుడిని నిందితులు కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు CCTV ఆధారాల్లో తేలిందన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు SP పేర్కొన్నారు.



