← Back to news

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుంది: నితిన్ గడ్కరీ

By RK· 30 Jul 2026
ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుంది: నితిన్ గడ్కరీ

20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వాడితే బండి మోడల్ బట్టి 2 నుంచి 6 శాతం దాకా మైలేజ్ తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో చెప్పారు. అయితే ఇలా వాడటం వల్ల ఇంజిన్ పాడవ్వడం లాంటి సమస్యలు ఏమీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. మామూలు పెట్రోల్ కన్నా E20 వాడితే బండి పికప్ బాగుంటుందని. పొల్యూషన్ కూడా 30% తగ్గుతుందని తెలిపారు. టూ వీలర్, ఫోర్ వీలర్ బండ్లపై అన్ని రకాల టెస్టులు చేశాకే ఈ విషయాలు తెలిశాయి అని మంత్రి అన్నారు.

More in News