← Back to news

సీటు కోసం మహిళల ఫైటింగ్.. ఎన్నాళ్లిలా?

By Bala· 9h ago· X

పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్నారు. సీటు విషయంలో మొదలైన చిన్న వివాదం మాటామాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లింది. బస్సులోనే ఒకరు మరొకరి జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ప్రయాణికుల ముందే తోపులాట, వాగ్వాదం జరిగింది. బూతులు కూడా తిట్టుకున్నారు. ఫ్రీ బస్సు సదుపాయం ఉన్నా సీట్ల కొరతతో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటన.. బస్సులో తీవ్ర కలకలం రేపింది.

More in TG