స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ జాబ్ కి రిసైన్ చేసిన UPSC ఆఫీసర్!
దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీలు, నీట్ (NEET) పరీక్ష అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ 2018 బ్యాచ్ మాజీ UPSC (IES) ఆఫీసర్ ప్రేమపాల్ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఆరేళ్ల ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు జరిగే మార్చ్‌లో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.



