పవిత్ర సంగమంలో కారు చీకట్లు

AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్ర సంగమంలో రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా–గోదావరి నదుల పవిత్ర కలయిక వద్ద సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పర్యాటకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవిత్ర సంగమానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వచ్చే వారికి లైట్లు వెలగకపోవడంతో చీకట్లోనే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.



