కాంగ్రెస్ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్

TG: ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ షాక్ ఇచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశారంటూ వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ వాయిస్ రికార్డుల్లో పార్టీ నేతలతోపాటు కొన్ని బీసీ కులాలపై ఆయన అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.



