రాష్ట్రానికే గర్వకారణంగా IIM.. ప్రారంభానికి సిద్ధం

AP: విశాఖపట్నంలోని IIM శాశ్వత క్యాంపస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రూ.450 కోట్ల వ్యయంతో 241.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంగణం పనులు 95 శాతం పూర్తయ్యాయి. అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోలార్ పవర్ సిస్టమ్‌తో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 2015 నుంచి తాత్కాలిక ప్రాంగణంలో కొనసాగుతున్న విశాఖపట్నం IIM, త్వరలో శాశ్వత క్యాంపస్‌లోకి మారనుండటం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగానికి రాష్ట్రప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు.



