కొందుర్గులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు రామగళ్ల సువర్ణ, దావిద్ దంపతుల గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు.




