కాంగోలో 8 ప్రాంతాలకు ఎబోలా వ్యాప్తి

కాంగోలో ఎబోలా వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా నార్త్-ఉబాంగిలో ఇద్దరికి వైరస్ సోకగా, ఒకరు చనిపోయారు. దీంతో ఎబోలా వ్యాపించిన ప్రాంతాల సంఖ్య 8కి చేరింది. ఈ వ్యాప్తిలో ఇప్పటివరకు 9,400కు పైగా కేసులు నమోదవగా, 4,500 మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ రకానికి ప్రత్యేకమైన టీకా అందుబాటులో లేదు. రోడ్లు సరిగా లేకపోవడం, వైద్య సదుపాయాల కొరత వల్ల వైరస్ను అరికట్టడం కష్టమవుతోందని WHO తెలిపింది.



