బాలికపై తాంత్రికుడి అత్యాచారం

విశ్వాస చికిత్స(Faith Healing) కోసం తల్లి తన కూతుర్ని తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లింది. తనపై అతను అత్యాచారం చేశాడు. యూపీకి చెందిన పరశురామ్ యాదవ్ తాంత్రికుడు. నరైనీ ప్రాంతానికి చెందిన మహిళ అనారోగ్యంతో ఉన్న 13 ఏళ్ల కూతుర్ని రెండు రోజుల క్రితం అతడి వద్దకు తీసుకెళ్లింది. ఆ సమయంలో బాలికపై అతను అత్యాచారం చేశాడని తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్ష కోసం ఆస్పత్రికి పంపారు.

