పోలీసులను అడ్డుకున్న స్టూడెంట్స్!
సూర్యాపేట చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నిరసన ప్రదర్శన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోటి విద్యార్థులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయి పోలీసులను తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



