మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసు

TG: మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తి నియోజకవర్గంలో పరిస్థితులు చూసి బాధగా ఉందని, ఈ పరిణామాలన్నీ భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నానని ఇటీవల ఆయన కామెంట్ చేయడం వైరల్ అయ్యింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితోపాటు మరికొందరు నేతలు టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్‌కు వివరణ ఇవ్వాలంటూ టీపీసీసీ ఆయనకు నోటీసులిచ్చింది. మూడు రోజులు వివరణ ఇవ్వాలని తెలిపింది.



