← Back to news

పంట ఎండిపోయి పశువుల మేతగా.. రైతు ఆవేదన

By Venkatesh· 10 Oct 2026· Medak

TG : వర్షాలు లేక పంట ఎండిపోవడంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పల్వంచలో ఒక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సాగునీరు అందక చేతికొచ్చే స్టేజ్‌లో ఉన్న వరి పంట ఎండిపోవడంతో చేసేదేమీ లేక దాన్ని కోసి పశువులకు మేతగా వేశాడు. టైమ్‌కి వర్షాలు పడక, నీళ్లు అందక పంటలు ఎండిపోతుండటంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగొచ్చేలా లేదని రైతులు టెన్షన్ పడుతున్నారు. కష్టపడి పెంచిన పంటను కళ్ల ముందే పశువుల మేతగా వేయాల్సి రావడంపై ఆందోళన చెందుతున్నారు.

More in TG