← Back to news

జంతర్ మంతర్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్

By RK· 24 Jul 2026
జంతర్ మంతర్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్

జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసన ప్రాంతంలో దిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. పాత నేరస్థులు, పరారీలో ఉన్నవారిని గుర్తించడానికి వీటిని కీలక మార్గాల్లో పెట్టారు. ఇవి నేరుగా పోలీసు డేటాబేస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. నిరసనకారులకు కాకుండా, అల్లర్లు సృష్టించే నేరస్థులను పట్టుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఈ కెమెరాలు తీసిన ముఖాలను వెంటనే డేటాబేస్‌తో పోల్చి తగిన చర్యలు తీసుకుంటారు.

More in News