జి.డి. నాయుడు: గ్రేట్ ఇండియన్ ఇన్వెంటర్!

భారతదేశ తొలి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్, రేడియో, ఎలక్ట్రిక్ రేజర్ సహా 100కు పైగా ఆవిష్కరణలు చేసిన గొప్ప శాస్త్రవేత్త జి.డి. నాయుడు(1893–1974). అందుకే ఆయనను<a href="https://www.thehindu.com/news/national/tamil-nadu/gd-naidu-the-edison-of-india-who-will-be-brought-to-life-on-screen-in-madhavan-starrer-biopic/article69237060.ece"> "భారతీయ ఎడిసన్" </a>అని పిలుస్తారు. సరైన ప్రాథమిక విద్య లేకపోయినా, సాధారణ మెకానిక్‌గా కెరీర్ ప్రారంభించి కొయంబత్తూరును పారిశ్రామిక హబ్‌గా మార్చారు. ఈ మహనీయుడి జీవిత కథ ఆధారంగానే ఆర్. మాధవన్ నటించిన 'G.D.N' బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



