పెళ్లైన నాలుగు నెలలకే విషాదం

AP: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలోని అయోధ్యనగర్‌లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన చంద్రకళ(24)కు ఈ ఏడాది ఏప్రిల్‌లో దేవేంద్రతో వివాహం జరిగింది. భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితుడి ఫోన్‌తో ఇంటికి చేరుకున్న భర్త.. తలుపులు వేసి ఉండటాన్ని గమనించి, చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



