SIR హీట్.. ఢిల్లీకి కాంగ్రెస్

TG: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, S.I.Rకు వ్యతిరేకంగా INDIA బ్లాక్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో జరగనున్న ప్రొటెస్ట్‌లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, TPCC chief మహేష్ కుమార్ గౌడ్ సహ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. నిన్న గోవాలోని కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్న CM అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు, MPలు, MLAలు, MLCలతో సహా కొంతమంది నేతలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరడంతో ఈ నిరసనకు ప్రాధాన్యం ఏర్పడింది.



