11 రోజులు విదేశీ పర్యటనలో సీఎం రేవంత్

TG: CM రేవంత్ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరైన ఆయన సాయంత్రం బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. యూకే, యూఎ్‌సలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో పాటు వెళ్తున్నారు. ఈనెల 30న వారు హైదరాబాద్‌కు చేరుకుంటారు.



