చార్మినార్ వద్ద హైఅలర్ట్.!

హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం వినాయక నిమజ్జనాలు, ముస్లింల నమాజ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

