కన్నీరు పెట్టించిన ఉదయభాను!

‘పంచనామా’ సీరియల్‌తో ప్రొడ్యూసర్‌గా మారిన ఉదయభాను.. అందరి హృదయాల్నీ ఎమోషనల్ చేశారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కి సంబంధించిన ఈవెంట్‌లో ఆమె భావోద్వేగం చెందారు. “నేనేం స్టార్స్ ఇంట్లో పుట్టలేదు.. ఎమోషనల్ కాకూడదని వచ్చాను. కానీ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను” అని అన్నారు. ఇన్నాళ్లూ యాంకర్, నటిగా మెప్పించిన ఆమె.. తొలిసారిగా నిర్మాతగా మారిన సందర్భంలో ఆమె మాటలు అందరి హృదయాల్నీ కదిలించాయి.



