← Back to news

ఆదివాసీ మహిళకు షాకింగ్ ట్విస్ట్

By DK· 25 Jul 2026· ఆదిలాబాద్ జిల్లా
ఆదివాసీ మహిళకు షాకింగ్ ట్విస్ట్

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం జవహర్‌నగర్‌కు చెందిన హీరకుమ్ర లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు పథకం దరఖాస్తులో ఊహించని షాక్ ఎదురైంది. ఆన్‌లైన్ రికార్డుల్లో ఆమె పేరుపై ఇప్పటికే ఇల్లు మంజూరై, రూ.51,200 విడుదలైనట్లు నమోదైంది. అయితే వాస్తవానికి ఆమెకు ఎలాంటి ఇల్లు లేదు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా L3 జాబితాలో నిలిచిపోయింది. గతంలో హౌసింగ్ అధికారులు రేషన్‌కార్డ్ వివరాలను దుర్వినియోగం చేసి అక్రమంగా నిధులు మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని ఇల్లు ఇప్పించాలని ఆమె కోరింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 14h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.