పులివెందులలో నామినేషన్ల సందడి

కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. చైర్పర్సన్ పదవికి టీడీపీ తరఫున నాలుగు, వైసీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. కౌన్సిలర్ స్థానాలకు టీడీపీ 69, వైసీపీ 30, బీజేపీ నాలుగు, జనసేన ఒక నామినేషన్ సమర్పించాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు.



