← Back to news

పసుపు కొమ్ములతో భారీ గణేష్!

By Jagadish· 1h ago
పసుపు కొమ్ములతో భారీ గణేష్!

విజయనగరం జిల్లా రాజాం మండలం బద్దం గ్రామంలో భారీ గణపతి కొలువుదీరాడు. 150 కిలోల పసుపు కొమ్ములతో 15 అడుగుల ఎత్తులో విగ్రహం తయారు చేశారు. ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో 21 రోజుల శ్రమతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా పూర్తిగా పర్యావరణహితంగా చేశారు. నవరాత్రి పూజలు, నిమజ్జనం తర్వాత పసుపు కొమ్ములను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది ఎకో-ఫ్రెండ్లీ వినాయకుడు కదా! మీ ఊరిలో కూడా ఇలాంటివి పెడితే మాకు ఫొటో, వార్త పంపండి.

More in Local