దోమల గుంపులతో లంగర్‌హౌజ్ హడల్.. జనం ఆందోళన!
TG: హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో దోమలు దండు. దోమలు గుంపులుగా తిరుగుతున్న విజువల్స్‌ను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ డిసీజెస్ వ్యాపించే అవకాశముందని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. శానిటేషన్ లోపం, కాలువలు సరిగా లేకపోవడంతో దోమల బ్రీడింగ్ స్పాట్స్ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ-లార్వల్ స్ప్రేయింగ్ చేయాలని శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నారు.



