దళిత మహిళలపై దూషణ.. చర్యలు కోరుతూ డిమాండ్

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా దళిత మహిళలపై వివక్ష చూపారని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ఆరోపించారు. దళిత మహిళలు తమతో కలిసి బతుకమ్మ ఆడొద్దని కొందరు అడ్డుకున్నారని, వారు రావడంతో బతుకమ్మలు మైలపడ్డాయని పసుపు నీళ్లు చల్లి నిమజ్జనం చేశారని తెలిపారు. ఈ ఘటన దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



