ఓట్ల తొలగింపులో తెలంగాణ టాప్!

TG: తెలంగాణ S.I.R ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలింది. రాష్ట్రంలో మొదట 3కోట్ల 38లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టులో రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ లిస్టులో 73లక్షల 39వేల మంది ఓటర్ల పేర్లు లేవు. మరో 92లక్షల 88వేల మంది డీటెయిల్స్ కూడా సరిగ్గా లేవు అంటూ నోటీసులు పంపారు అధికారులు. ఇంత భారీగా పేర్లను తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది. అర్హులైన ఓటర్ల పేర్లు లిస్టులో ఉండి తీరాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.



