ఆ జీవో వద్దంటే వద్దు.. భగ్గుమంటున్న విద్యార్థి లోకం!
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం GO MS 97 ద్వారా పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇది పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఉంది. దీని వల్ల తాము SBTET స్వతంత్రత కోల్పోతామనీ, ఫీజులు పెరుగుతాయనీ, స్కాలర్‌షిప్‌లు తగ్గుతాయనీ, ECET ద్వారా ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అవకాశం కోల్పోతామనీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


