కొత్త పెన్షన్లపై ప్రభుత్వం బిగ్ అప్‌డేట్

TG: రాష్ట్రంలో చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సదరం సర్టిఫికెట్ రెన్యూవల్ చేయకపోవడంతో కొందరికి పెన్షన్లు నిలిచిపోయాయని మంత్రి సీతక్క తెలిపారు. దివ్యాంగుల దరఖాస్తులు స్వీకరిస్తున్నామనీ, ఇందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పెన్షన్లు ఇస్తామన్నారు. అనర్హుల పేర్లను తొలగిస్తున్నామన్న ఆమె.. తలసేమియా బాధితులకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని తెలిపారు.

