తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా విదేశీ ఉద్యోగాల మోసాలు

AP: గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా వచ్చిన విదేశీ ఉద్యోగ మోసాల కంప్లైంట్లలో తెలుగు రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,495 ఫిర్యాదులతో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉండగా, 339 ఫిర్యాదులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 625తో కేరళ రెండు, 357తో తమిళనాడు మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4,000 ఫిర్యాదుల్లో ఏపీ వాటా దాదాపు 37 శాతం.



