← Back to news

9మంది విద్యార్థులకు 8మంది టీచర్లు

By DK· 15 Jul 2026
9మంది విద్యార్థులకు 8మంది టీచర్లు

TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో HMతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో HMతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులు, తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, 7వ తరగతిలో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డుతో పాటు అన్నీ మౌలికవసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి.

More in Education