← Back to news

ఇండిగోలో పవర్ బ్యాంక్ ఫైర్!

By Nani Eluri· 11 Oct 2026· Ndtv
ఇండిగోలో పవర్ బ్యాంక్ ఫైర్!

TG: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E6115లో ఓ ప్యాసింజర్ పవర్ బ్యాంక్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో విమానంలో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది మంటలను ఆర్పేశారు. విమానంలో ఉన్నవారి సేఫ్టీ కోసం ఫ్లైట్‌ను హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో అందరూ సేఫ్‌గా ఉన్నారు. చిన్న పవర్ బ్యాంక్‌తో మొదలైన ఈ ఘటన విమానంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేసింది.

ఇండిగోలో పవర్ బ్యాంక్ ఫైర్!

More in TG