CJP లీడర్స్ రిలీజ్.. వీడియో
ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో CJP లీడర్స్ అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. ఐతే.. వాళ్లను దాదాపు 24 గంటలపాటూ డిటైన్ చెయ్యడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి నిన్న ఢిల్లీ, జంతర్ మంతర్ ప్రొటెస్టులో పాల్గొనేందుకు వస్తున్న సమయంలో.. ఈ ముగ్గురినీ విమానంలోనే డిటైన్ చేశారు పోలీసులు. ఇలా చెయ్యడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్నలొస్తున్నాయి.
