వీధి నాటకాలతో హెచ్‌ఐవీపై బిగ్ అవేర్‌నెస్

AP: వీధి నాటకాల ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గొర్రెల శ్రీనివాస్ కళాజాత బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఆలమూరు, కొత్తూరు సెంటర్, మడికి ప్రధాన కూరగాయల మార్కెట్ సర్కిల్‌లో వీధి నాటకాల ద్వారా హెచ్‌ఐవీ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలను వివరించారు.

