ప్రతి భూమికి భూధార్ కార్డు: పొంగులేటి

TG: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన 'రీ సర్వేలో' ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ యజమానుల అభ్యంతరాలను స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. సర్వే వేగవంతం చేసేందుకు మరో 400 రోవర్లను కొనుగోలు చేయనున్నారు. వచ్చే నెలలో తొలి దశ సర్వే పూర్తి చేసిన తరువాత ప్రతి భూ కమతానికి భూధార్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.


