ఉద్యోగుల సమస్యలపై ఇక పోరుబాటే: బొప్పరాజు

AP: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై AP JAC ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు రావాల్సిన సుమారు రూ.40వేల కోట్ల బకాయిలను అడుగుతుంటే ఉద్యోగులనే ప్రజల ముందు దోషులుగా చూపించడం సరికాదని JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం విషయంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.



