గాజా యుద్ధంపై ‘NAZA’.. అసలేంటిది?

గాజాలో ఇజ్రాయెల్ సైన్యం AI సాయంతో టార్గెట్లను ఎంచుకుంటోందన్న విషయంపై ‘NAZA’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన యూవల్ అబ్రహామ్, రేచల్ సోర్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇందులో ఇజ్రాయెల్ సైన్యం, నిఘా విభాగంలో పనిచేసిన 24 మంది తమ అనుభవాలను పేర్లు చెప్పకుండా పంచుకున్నారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 56 దేశాల్లో రిలీజ్ కానుంది.


