← Back to news

గాజా యుద్ధంపై వాటికన్ వద్ద నిరసన!

By Lokesh· 4h ago
గాజా యుద్ధంపై వాటికన్ వద్ద నిరసన!

సెప్టెంబర్ 22న గాజా యుద్ధాన్ని ఆపాలని కోరుతూ దాదాపు 150 మంది కాథలిక్ పూజారులు, బిషప్, సన్యాసినులు రోమ్‌లోని వాటికన్‌కు మార్చ్ చేశారు. సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ప్రార్థనలు చేసి, గాజా, లెబనాన్‌లో మరణించిన 300 మంది పిల్లల పేర్లతో బ్యానర్ చూపించారు. ‘ప్రీస్ట్స్ అగైనెస్ట్ జెనోసైడ్’ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. మార్చ్ తర్వాత వారు పాలస్తీనా, లెబనాన్ రాయబార కార్యాలయాలకు కూడా వెళ్లారు.

More in International