← Back to news

శాలువా పై ఫోటోలు

By BK· 7 Oct 2026· సిరిసిల్లా
శాలువా పై ఫోటోలు

TG : సిరిసిల్లా నేత కార్మికుడు వెళ్ది హరిప్రసాద్ మగ్గంపై దుబాయ్ రాజకుటుంబ సభ్యుల ఫోటోలతో ఒక స్పెషల్ శాలువాను తయారుచేశారు. 15 రోజులు కష్టపడి నేసిన ఈ శాలువాను ఈ నెల 11న దుబాయ్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శించి, అక్కడ రాజకుటుంబానికి గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. దారాల పోగులతో ఫోటోలను పర్ఫెక్ట్‌గా నేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా మన తెలంగాణ చేనేత కళకు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు రానుంది.

More in TG