మహిళపై కండక్టర్ దాడి!
శంషాబాద్‌లో ఆర్‌టీసీ బస్సు ఎక్కిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు ఆమె టికెట్ తీసుకుంది. డ్రైవర్ అక్కడ బస్సు ఆపకుండా నేరుగా కొత్తూర్ వరకు తీసుకెళ్లాడు. బస్సు ఎందుకు ఆపలేదని కండక్టర్‌ను నిలదీయడంతో, ఆయన తనపై దాడి చేసి చెంపదెబ్బలు కొట్టాడని బాధితురాలు ఏడుస్తూ చెప్పింది. తన మెడపై పడిన దెబ్బల గుర్తులను చూపిస్తూ మీడియా ముందు ఎమోషనల్ అయింది.



