మంత్రి కొండా సురేఖ.. రాజీనామా చేయాల్సిందేనా?

TG: మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఖర్గే సూచించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజీనామాకు నో చెబితే భర్తరప్ చేసే అవకాశం ఉంది. భర్తరప్ నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు పంపనున్నారు. సాయంత్రంలోగా రాజీనామా, భర్తరప్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందన్న అంశం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు సురేఖ మాత్రం రాజీనామా చేయనని ఇప్పటికే స్పష్టం చేశారు.



