← Back to news

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌

By Anusha· 5 Oct 2026
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌

తెలంగాణలో ఖేలో ఇండియా సందడి మొదలు కానుంది! డిసెంబర్ 11 నుంచి 22 వరకు యూత్ గేమ్స్-2026 జరగనున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరో 5 నగరాల్లో 27 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. గచ్చిబౌలిలో ప్రారంభోత్సవం, ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు జరగనున్నాయి. హుస్సేన్ సాగర్‌లో రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

More in Sports